ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!

- September 27, 2026 , by Maagulf
ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!

దోహా: విద్యార్థులకు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, కార్మిక మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించేందుకు ఖతార్ సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్‌మెంట్ బ్యూరో, విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE)తో కలిసి జాతీయ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, కెరీర్ కౌన్సిలర్లకు భవిష్యత్‌లో అధిక డిమాండ్ ఉండే విద్యా విభాగాలు, స్పెషలైజేషన్లు, కెరీర్ మార్గాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే విద్యార్థులు చిన్న వయసులోనే తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుంది. వారి ప్రతిభకు అనుగుణంగా సరైన విద్యా కోర్సులు, భవిష్యత్ వృత్తి అవకాశాలను ఎంచుకునేలా మార్గనిర్దేశం చేయనున్నారు.

యువతకు చిన్న వయసు నుంచే కెరీర్‌పై అవగాహన కల్పించడం, భవిష్యత్తుకు సంబంధించి సమాచారంతో కూడిన, ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com