సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!

- September 27, 2026 , by Maagulf
సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!

జెడ్డా:  సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ (NCM) హెచ్చరించింది. జజాన్, అసీర్, అల్-బహా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండటంతో పాటు వడగళ్ల వాన, బలమైన గాలులు, దుమ్ము, ఇసుక తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్

ఇదిలా ఉండగా తూర్పు ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అల్-అహ్సా, అల్-ఖోబర్, దమ్మామ్, ఖతీఫ్, బుఖైక్, రాస్ తనూరా ప్రాంతాల్లో ఈ అలర్ట్ అమల్లో ఉంటుందని తెలిపింది.  మదీనా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైల్, అల్-ఖాసిమ్, నార్తర్న్ బోర్డర్స్ ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో దుమ్ము, ఇసుక ఎగిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com