ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- September 27, 2026
దోహా: విద్యార్థులకు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, కార్మిక మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించేందుకు ఖతార్ సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో, విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE)తో కలిసి జాతీయ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, కెరీర్ కౌన్సిలర్లకు భవిష్యత్‌లో అధిక డిమాండ్ ఉండే విద్యా విభాగాలు, స్పెషలైజేషన్లు, కెరీర్ మార్గాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే విద్యార్థులు చిన్న వయసులోనే తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుంది. వారి ప్రతిభకు అనుగుణంగా సరైన విద్యా కోర్సులు, భవిష్యత్ వృత్తి అవకాశాలను ఎంచుకునేలా మార్గనిర్దేశం చేయనున్నారు.
యువతకు చిన్న వయసు నుంచే కెరీర్‌పై అవగాహన కల్పించడం, భవిష్యత్తుకు సంబంధించి సమాచారంతో కూడిన, ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







