అమరావతి స్పోర్ట్స్ సిటీలో కోచ్ గోపీచంద్ అకాడమీకి 15 ఎకరాలు..
- August 23, 2016
అందరిలో స్ఫూర్తి నింపడానికే ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ పీవీ సింధుకు స్వాగతం చెప్పానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన సింధుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన ఆయన మాట్లాడుతూ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే మనకు గుర్తింపు రాదని అన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో కోచ్ గోపీచంద్ అకాడమీకి 15 ఎకరాలు కేటాయిస్తాని సీఎం ప్రకటించారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని ఆయన అన్నారు. గోపీచంద్‌కు ఏయూ (ఆంధ్రా యూనివర్శిటీ) గౌరవ డాక్టరేట్ ఇవ్వడం హర్షనీయమన్నారు.ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోపీచంద్ అకాడమీ ఏర్పాటుకు గచ్చిబౌలీలో 5 ఎకరాల స్థలం ఇచ్చి ప్రోత్సహించానని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.గొపీ ఏర్పాటు చేసిన అకాడమీలో ప్రాక్టీస్ చేసిన సింధు పతకం గెలిచిందని అన్నారు. అమరావతిలో క్రీడలకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని క్రీడలకు ప్రాధాన్యత పెరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం కావాలని పిలుపు ఇఛ్ఛారు.చైనా, అమెరికా కంటే ప్రతిభ గల క్రీడాకారులు భారత్‌లో ఉన్నారని, శారీరక క్రీడలు మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ల్‌లో పతకం సాధించకపోయినా బాగా ప్రతిభ కనబరిచాడని కిదాంబి శ్రీకాంత్‌కు కితాబిచ్చారు. ఆయనను కూడా ప్రోత్సహించేందుకు రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రజినీకి కూడా రూ.25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.క్రీడలకు కేంద్రంగా అమరావతిని తయారు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







