6200 మంది మహిళలకు మొబైల్‌ ఫోన్‌ శిక్షణ

- August 23, 2016 , by Maagulf
6200 మంది మహిళలకు మొబైల్‌ ఫోన్‌ శిక్షణ

టెక్నికల్‌ మరియు ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కార్పొరేషన్‌ (టివిటిసి), తాజాగా 6200 మంది మహిళలు ఇటీవల మొబైల్‌ ఫోన్‌ మెయిన్‌టెనెన్స్‌ మరియు అమ్మకాల విభాగంలో శిక్షణ పొందినట్లు వెల్లడించింది. టివిటిసి అధికార ప్రతినిథి ఫహల్‌ అల్‌ ఒటైబి మాట్లాడుతూ, 19 టెక్నికల్‌ కాలేజీల్లో ఈ శిక్షణ ఇప్పించినట్లు వివరించారు. మొబైల్‌ ఫోన్స్‌కి సంబంధించి ప్రాధమిక శిక్షణను వారికి ఇప్పించారు. మొబైల్‌ మెయిన్‌టెనెన్స్‌, సేల్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ మరియు మెయింటెనెన్స్‌ వంటివే కాకుండా, అడ్వాన్స్‌డ్‌ మొబైల్‌ ఫోన్స్‌కి సంబంధించి కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది. శిక్షణ పొందినవారిలో 92.3 శాతం మంది పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన పొందారనీ, వారందరినీ మెరికల్లా తీర్చిదిద్దామని వివరించారు. అత్యాధునిక పద్ధతుల్లో వారికి శిక్షణను అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com