కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- October 05, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో పెరుగుతున్న లైంగిక నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, విద్యార్థినులపై వేధింపులకు పాల్పడే ఉన్మాదుల్లో, నేరప్రవృత్తి ఉన్న పురుషుల్లో మరణ భయం పుట్టించాలని ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు, ఇటీవల స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై జరిగిన దారుణ సమూహ అత్యాచారం కేసును సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్డీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
“ఇకపై ఏమైనా నేరం చేస్తే చనిపోతాం” అనే ఖచ్చితమైన భయం అసాంఘిక శక్తుల మనస్సుల్లో నాటుకుపోయేలా పోలీసుల చర్యలు ఉండాలని, అప్పుడే ఇలాంటి దారుణాలను అరికట్టగలరని కోర్టు పేర్కొంది. అల్లరి మూకలు, పోకిరీలు పదేపదే విద్యార్థినులను వేధించే కళాశాలల వద్ద పోలీసులు ముందుగా దృష్టి సారించాలని ఆదేశించింది.
ఢిల్లీ వ్యాప్తంగా వెలసిన వేలాది అక్రమ ఈటరీలు (రోడ్డు పక్కన ఉండే హోటళ్లు/స్టాళ్లు) అసాంఘిక శక్తులకు స్థావరాలుగా మారాయని, అక్కడ మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
దక్షిణ ఢిల్లీలోని ఒక గర్ల్స్ కాలేజీకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కులో జరిగిన సమూహ అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ.. “సదరు క్రిమినల్స్ గురించి స్థానికులు ముందుగానే హెచ్చరించినా పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు?” అని ధర్మాసనం ప్రశ్నించింది.
“మనం కలిసి పనిచేస్తేనే ఈ నేరాలను అరికట్టగలము. దేశ రాజధానిలో ఇలాంటి దారుణాలను పూర్తిగా అరికట్టడానికి ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ ఏర్పాటు దిశగా తీసుకుంటున్న చర్యలపై సమాచారం అందించాలి” అని జస్టిస్ పార్డీవాలా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







