సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- October 05, 2026
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL)కు 27వ సీఐఐ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ 2026లో వరుసగా ఎనిమిదో ఏడాది ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ ఎనర్జీ లీడర్’ అవార్డు లభించింది. అలాగే, వరుసగా పదో ఏడాది ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్’ గా కూడా గుర్తింపు పొందింది. ఎనర్జీ మేనేజ్‌మెంట్ మరియు ఎనర్జీ కన్జర్వేషన్‌పై విమానాశ్రయం కొనసాగిస్తున్న నిరంతర దృష్టికి ఈ గుర్తింపులు మరింత బలాన్ని చేకూర్చాయి.
సీఐఐ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అనేది ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్ మరియు సస్టెయినబిలిటీ రంగాల్లో అత్యుత్తమ పనితీరును గుర్తించే భారతదేశంలోని ప్రముఖ వేదికల్లో ఒకటి. ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచడం, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం మరియు సస్టెయినబుల్ ప్రాక్టీసెస్‌ను అవలంబించడంలో కొలిచే స్థాయిలో పురోగతి, ఆవిష్కరణలు మరియు నిబద్ధతను ప్రదర్శించే సంస్థలకు ఈ అవార్డులు అందజేస్తారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 700కు పైగా కంపెనీలు పాల్గొనగా, అవార్డుల కార్యక్రమం 16–18 సెప్టెంబర్ 2026 మధ్య హైదరాబాద్‌లో నిర్వహించబడింది.
హైదరాబాద్ విమానాశ్రయం తన కార్యకలాపాల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ మరియు సస్టెయినబిలిటీని సమగ్రంగా అనుసంధానించడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ఎనర్జీ కన్జర్వేషన్ చర్యలు, రెన్యూవబుల్ ఎనర్జీ మరియు ఎఫిషియెంట్ ఆపరేషనల్ ప్రాక్టీసెస్‌ను అవలంబించడం ద్వారా విమానాశ్రయం ఎనర్జీ కన్జంప్షన్‌ను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఈ చర్యలు ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌లో నిరంతర మెరుగుదలకు దోహదపడటంతో పాటు, ఆర్జీఐఏను బాధ్యతాయుతమైన మరియు సస్టెయినబుల్ ఎయిర్‌పోర్ట్‌గా మరింత బలోపేతం చేశాయి.
ఈ విజయం పై స్పందిస్తూ, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ కధీర్ కధీరవన్ మాట్లాడుతూ, “సస్టెయినబిలిటీ అనేది మా కార్యకలాపాల విధానంలో అంతర్భాగం. బాధ్యతాయుతమైన అభివృద్ధి మరియు సీమ్‌లెస్ ప్యాసింజర్ ఎక్స్‌పీరియన్స్ రెండూ సమాంతరంగా సాగాలనే నమ్మకంతో ఎనర్జీ ఎఫిషియెన్సీపై మా నిబద్ధత కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా, రిసోర్స్ కన్జంప్షన్‌ను ఆప్టిమైజ్ చేయడంతో పాటు విమానాశ్రయం అంతటా ఎఫిషియెన్సీని మెరుగుపరిచేందుకు ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్, రెన్యూవబుల్ ఎనర్జీ మరియు స్మార్టర్ ఆపరేషనల్ ప్రాక్టీసెస్‌లో నిరంతరం పెట్టుబడులు పెడుతున్నాం. మా విజన్ సమర్థవంతమైన, రెసిలియెంట్ మరియు సస్టెయినబుల్ ఎయిర్‌పోర్ట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంతో పాటు, మా ప్రయాణికులకు కంఫర్టబుల్ మరియు సీమ్‌లెస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడం. వరుసగా ఎనిమిదో ఏడాది ‘నేషనల్ ఎనర్జీ లీడర్’గా, వరుసగా పదో ఏడాది ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్’గా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నుంచి గుర్తింపు పొందడం మా సిబ్బంది మరియు భాగస్వాముల సమష్టి కృషికి నిదర్శనం. ఈ గుర్తింపులు సస్టెయినబుల్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్‌లో మరింత ఇన్నోవేషన్‌కు, అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.”
జీహెచ్ఐఏఎల్‌కు లభించిన ఈ గుర్తింపు కింది అంశాల పై నిర్వహించిన కఠినమైన మరియు సమగ్ర ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఫలితంగా లభించింది:
- ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్
- ఎనర్జీ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్
- సస్టెయినబిలిటీ లీడర్‌షిప్
ఐఎస్ఓ 50001:2018 ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు ఇతర ఐఎస్ఓ స్టాండర్డ్స్ అమలు
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు అవేర్‌నెస్
ఈ రెండు గుర్తింపులు ఎనర్జీ ఎఫిషియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, టెక్నాలజీ మరియు ఆప్టిమైజ్డ్ ఆపరేషనల్ ప్రాక్టీసెస్‌లో నిరంతర పెట్టుబడుల ద్వారా ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ను సమగ్రంగా చేపడుతున్న జీహెచ్ఐఏఎల్ విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అదే సమయంలో, మరింత మెరుగైన ఎఫిషియెన్సీ మరియు సస్టెయినబిలిటీ సాధించే దిశగా ఉద్యోగులు మరియు స్టేక్‌హోల్డర్లలో రెస్పాన్సిబుల్ ఎనర్జీ యూజ్‌ను ప్రోత్సహించడంపైనా విమానాశ్రయం దృష్టి సారిస్తోంది.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







