షార్జాలో జరిగిన దాడులలో వేలమంది అక్రమ బిచ్చగాళ్ళు పట్టివేత
- August 24, 2016
షార్జ: వచ్చే నెలలో జరగనున్న ఈద్ అల్ అధా పండుగకు ముందే 9.663 మంది అక్రమంగా అడుక్కునే వారిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అలాగే తన ఫ్లాట్ లో అక్రమంగా 1 మిలియన్ డి హెచ్ దాచి పెట్టిన ఒక అరబ్ వ్యక్తిని సైతం పోలీసులు అదుపులో తీసుకొన్నారు, పోలీసుల వలలో అనుమానితులైన 6.850 పురుషులు మరియు 2,813 మహిళలు దొరికిపోయారు. ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో 440 దాడులు జరిపి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా అల్ తావన్ ప్రాంతంలో ఒక యాభై ఏళ్ళ వయస్సు ఉన్న ఒక అరబ్ వ్యక్తి యాచకునిగా నటిస్తూ వీధుల్లో నిలబడి యాచించడం ద్వారా1 మిలియన్ డి హెచ్ అపారమైన నగదుని పోగుచేసాడు. యాచన ద్వారా అక్రమంగా ఈ సొమ్ముని సేకరించినట్లు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి పోలీసులు డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్జా బిచ్చగాడు నిరంతరం యుఎఇ షార్జా మధ్య పర్యటిస్తూ ఉండేవాడని అధికారుల పరిశోధనలో తేలింది. అదేవిధంగా పోలీసులు షార్జాలో షాపింగ్ సెంటర్ మరియు అక్రమ కార్యకలాపాలు కలిసి కార్లను కడిగే పనిచేసే 20 మంది అక్రమ ఆసియా నివాసితులు తమ పని ముగిసిన తర్వాత చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా నెలకు 1.2 డి హెచ్ మిలియన్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.షార్జా పొలిసు ఉల్లంఘనలు విభాగం ముఖ్యఅధిపతి లెఫ్టినెంట్ కల్నల్ సలీం హరిమళ్ మాట్లాడుతూ అరెస్టు వారిలో పెద్ద సంఖ్యలో భవనాలలో , భవన స్థలాల్లో , వర్క్ షాప్ మరియు ఖాళీ కార్మిక వసతి ప్రాంతాల్లో దాక్కున్నట్లు ఆయన తెలిపారు.పోలీసులు క్రొత్త ఈద్ అల్ అధా ప్రచారంలో వారిని నమ్మకద్రోహులుగా చిత్రీకరిస్తూ ఈ రాబోయే సెలవుల్లో షార్జా వీధుల్లో వీరి యాచనని అరికట్టేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా చెప్పారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







