‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- October 05, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే మహోన్నత లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార’ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా రూ. 30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ బృహత్తర పథకానికి వారు నాంది పలికారు.
27 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల దాహార్తిని తీర్చే దిశగా ఈ పథకం ద్వారా కొత్తగా 27 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ ఉచిత కుళాయి కనెక్షన్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గండికోట రిజర్వాయర్ ఆధారంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రజలకు తాగునీరు అందించడానికి రూపొందించిన సమగ్ర తాగునీటి ప్రాజెక్టు పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
ఈ మహత్తర పథక పనుల ప్రారంభానికి సూచికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా మొత్తం 13 శిలాఫలకాలను ఆవిష్కరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం, నాయకులు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
నేతల ప్రజా అభివాదం
సభా ప్రాంగణంలో భక్తులు, ప్రజల పలకరింపుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిసి నడుస్తూ, హాజరైన ప్రజలకు ఆత్మీయంగా అభివాదం చేశారు. గ్రామీణ రూపురేఖలను మార్చేలా ఈ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తవుతుందని ఈ సందర్భంగా నేతలు ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







