కువైట్ ఫ్రైడే మార్కెట్‌లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- October 05, 2026
కువైట్ : కువైట్‌లోని అల్-రాయ్ ప్రాంతంలోని ఫ్రైడే మార్కెట్‌లో అక్టోబర్ 2న నిర్వహించిన భద్రతా తనిఖీల్లో 61 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో అరెస్ట్ వారెంట్లు ఉన్నవారితో పాటు రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారు. ఫర్వానియా గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.
ఈ ప్రత్యేక తనిఖీల్లో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు కువైట్ మున్సిపాలిటీ, విద్యుత్-నీరు-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు కూడా పాల్గొన్నారు.
అరెస్టయిన వారిలో ఎవరెవరు?
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం..25 మంది గైర్హాజరు నివేదికలకు సంబంధించి అరెస్ట్ వారెంట్లు ఉన్నవారు ఉన్నారు. 16 మంది గడువు ముగిసిన రెసిడెన్సీ కలిగినవారు, 8 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు, ముగ్గురు గడువు ముగిసిన వీసాలతో ఉన్నవారు, ఇద్దరు రుణ కేసుల్లో వాంటెడ్ వ్యక్తులు, ఇంకో ఇద్దరు ఆరోగ్య నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారు, మరో ఇద్దరు వీధి వ్యాపారులతోపాటు కోర్టు తీర్పు అమలుకు వాంటెడ్ కు సంబంధించి నలుగురు ఉన్నారు.
15 ఉల్లంఘన కేసులు నమోదు
భద్రతా తనిఖీల్లో మొత్తం 15 ఉల్లంఘన నివేదికలుకూడా నమోదు చేశారు. వాటిలో 7 కేసులను పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మరో 7 కేసులను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్, ఒక కేసును కువైట్ మున్సిపాలిటీ నమోదు చేసింది.
ఈ తనిఖీల సందర్భంగా 120 మానవతా సహాయ కేసులను కూడా అధికారులు పరిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్కెట్‌లో భద్రతా సిబ్బంది ఉనికిని మరింత పెంచినట్లు పేర్కొంది. అరెస్టయిన వారందరిపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్‌లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







