భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- October 05, 2026
దుబాయ్: భారత్–యూఏఈ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిగాయి. దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఈ. విష్ణువర్ధన్ రెడ్డి, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మారీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా భారత్–యూఏఈ మధ్య కొనసాగుతున్న బలమైన ఆర్థిక భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరువురు చర్చించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడం, ఇరు దేశాల వ్యాపార వర్గాల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు.
భారత్–యూఏఈ మధ్య ఆర్థిక సహకారం మరింత విస్తరించేందుకు ఇలాంటి ఉన్నతస్థాయి చర్చలు కీలకంగా మారనున్నాయి.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







