ఏపీలో పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా స్పెయిన్‌లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
- October 07, 2026
అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయంగా ఏపీ పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కందుల దుర్గేష్ స్పెయిన్ లో పర్యటిస్తున్నారు.అక్టోబర్ 6 నుండి 8 వరకు స్పెయిన్‌లోని సెవిల్లె-ఫిబెస్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగుతోన్న అంతర్జాతీయ 'టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026'లో పాల్గొననున్నారు..డిజిటల్ టూరిజం నుంచి స్మార్ట్ డెస్టినేషన్స్ దాకా.. ఏపీ పర్యాటక భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి దుర్గేష్ ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికత, సుస్థిర అభివృద్ధిపై జరిగే అత్యున్నత స్థాయి చర్చల్లో మంత్రి దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి దుర్గేష్ భేటీ కానున్నారు.టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, పర్యాటక రంగంలోనూ సాంకేతికతకు పెద్దపీట వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి, పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించి, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించనున్నారు. ఏపీ పర్యాటక రంగం తరఫున మంత్రి దుర్గేష్ బృందం అధికారిక ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. కీలక సమావేశాలు, ప్యానెల్ చర్చలు, కీనోట్ సెషన్లు, నెట్వర్కింగ్,బీ2బీ సమావేశాల ద్వారా ఏపీ టూరిజానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి మంత్రి దుర్గేష్ చర్యలు తీసుకుంటున్నారు.ప్రత్యేకించి, డిజిటల్ ఇన్నోవేషన్, స్మార్ట్ డెస్టినేషన్స్, సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటకం, పర్యాటక పెట్టుబడులు - ఫైనాన్స్ ఫోరమ్, డెస్టినేషన్ మార్కెటింగ్, సందర్శకుల అనుభవం, అలాగే ఏవియేషన్, మొబిలిటీ, కనెక్టివిటీ అంశాలపై జరగనున్న ప్రత్యేక చర్చల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక వనరులను, ప్రత్యేకతలను మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో వినిపించనున్నారు. కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో గత రెండేళ్ల కాలంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, రూ.20 వేల కోట్ల పెట్టుబడులను సాధించామన్నారు. నూతన పర్యాటక పాలసీ (2024-29) పట్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తి చూపుతున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు.అమరావతి నుంచి అట్లాంటిక్ దాకా ఏపీ పర్యాటక కీర్తిని చాటేలా ఈ పర్యటన కొనసాగనుంది. అదే విధంగా స్పెయిన్ లోని పర్యాటక ప్రాంతాలను పరిశీలించి మంత్రి దుర్గేష్ అధ్యయనం చేసి ఏపీలో ఆ విధానాలు అవలంబించనున్నారు.
మంత్రి దుర్గేష్ తో పాటు ఈ పర్యటనలో ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- నల్లసముద్రంలో ట్యాంకర్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 23 మంది భారతీయులు సేఫ్
- ప్రజా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై భారత్–దుబాయ్ మధ్య సహకారం బలోపేతం
- ఏపీలో పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా స్పెయిన్‌లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
- పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ
- దసరా పండక్కి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్..
- ఇరాన్ హోం మంత్రితో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి భేటీ..!!
- సహెల్ యాప్‌లో పీఏసీఐకి చెందిన 34 సేవలు..!!
- యూఏఈలో ఆహార పదార్థాలకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే Dh500,000 వరకు ఫైన్..!!
- సౌదీ అరేబియా, బహ్రెయిన్ మధ్య చారిత్రక, బలమైన బంధం..!!
- జనరేషన్-జెడ్‌లో సోషల్ మీడియా వినియోగంతో మానసిక, శారీరక సమస్యలు..!!







