బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- October 08, 2026
మనామా: వెటర్నరీ నమూనాలను బహ్రెయిన్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన అనుమతుల జారీ ప్రక్రియను బహ్రెయిన్ మున్సిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరింత సులభతరం చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ ఈ-గవర్నమెంట్ అథారిటీ (iGA) సమన్వయంతో ఈ డిజిటల్ సేవను అభివృద్ధి చేశారు. వెటర్నరీ నమూనాల రవాణా సమయంలో ఆరోగ్య, పశువైద్య, బయోసేఫ్టీ నిబంధనలను పాటించేలా ఈ సేవను రూపొందించారు. అంతర్జాతీయ షిప్పింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో పాటు, సరిహద్దులు దాటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడం కూడా ఈ సేవ ప్రధాన లక్ష్యంగా ఉంది.
అప్‌గ్రేడ్ చేసిన సేవలో భాగంగా అనుమతి జారీ ప్రక్రియను ఒక పని దినానికి తగ్గించారు. గతంలో ఉన్న ఏడు దశల దరఖాస్తు ప్రక్రియను మూడు దశలకు కుదించారు. అంతేకాకుండా దరఖాస్తుదారులు ఇకపై అదనపు సహాయక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. మొత్తం సేవను డిజిటల్ విధానంలోకి తీసుకువచ్చారు. సేవా స్థాయి ఒప్పందం (SLA) సమయాన్ని కనీసం 25 శాతం తగ్గించారు. దరఖాస్తు ఫారాలను మెరుగుపరిచి ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోకి మార్చారు. వివిధ డిజిటల్ ఛానళ్లలో సేవకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఒకే విధంగా ఉండేలా ప్రమాణీకరించారు.
నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు
వ్యవసాయ, జంతు సంపద వ్యవహారాల అండర్‌సెక్రటరీ అసిమ్ అబ్దుల్ లతీఫ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. లబ్ధిదారులు బహ్రెయిన్ నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు అందిన తర్వాత మంత్రిత్వ శాఖ దాన్ని పరిశీలించి అవసరమైన ప్రక్రియలను పూర్తి చేస్తుంది. అనంతరం వెటర్నరీ నమూనాల ఎగుమతి అనుమతిని కూడా ఎలక్ట్రానిక్ విధానంలోనే జారీ చేస్తుంది. ఈ మార్పులతో దరఖాస్తుదారుల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







