సినిమా రివ్యూ: ‘కామ్రేడ్ కళ్యాణ్’.!
- October 10, 2026
ఆదర్శ కుటుంబం’ సినిమా వాయిదా పడడంతో అనూహ్యంగా తెర పైకి వచ్చిన సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. కామ్రేడ్ కళ్యాణ్ అనే టైటిల్ వింటే ఇదో సీరియస్ సినిమా అనుకునేరు. ప్రచార చిత్రాల్లో ఆల్రెడీ శాంపిల్ చూపించేశారు. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అని. శ్రీ విష్ణు తనకి బలమైన కథాంశాన్ని ఎంచుకున్నాడే మళ్లీ అని. మరి, ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకుందా.? లేదా.? తెలియాలంటే ‘కామ్రేడ్ కళ్యాణ్’కథ ఏంటో తెలుసుకోవాలి.
కథ:
90ల నాటి కథ ఇది. అప్పట్లో ఆంధ్రా ఒరిశా సరిహద్దుల్లో అడవిలోని అన్నలకీ, పోలీసులకీ మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా కథ. కాన్సెప్ట్ వింటున్నా ఇది సీరియస్ మూవీనే అనిపిస్తుంది కదా. అలా అయితే, తప్పులో కాలేసినట్లే. కాస్త ఆగండి కథలోకి వెళ్లిపోదాం. ఏదో అంతంత మాత్రం చదువుకున్న తాడికొండ కళ్యాణ్ తాను వుండే ఊళ్లోనే ఓ సినిమా ధియేటర్ లీజుకు తీసుకుని రన్ చేస్తూంటాడు. అడవిలోని అన్నలను ఏరివేయడానికి స్పెషల్‌గా నియమించబడతాడు ఐపీఎస్ ఆఫీసర్ జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో). అడవిలోని అన్నల దళానికి నాయకుడు మాస్టార్ (సాయి చంద్). ఈ దళాన్ని పట్టుకుని మట్టు పెట్టాలన్నదే జార్జ్ కుట్టి డ్యూటీ. ఇదిలా వుంటే.. అదే ఊళ్లోకి కొత్తగా వచ్చిన ఒరియా అమ్మాయి సితార దేవి (మహిమా నంబియార్). ప్రాణాపాయ స్థితిలో వున్న తన తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్ కుమార్)ని కాపాడిందని తొలి చూపులోనే లవ్ చేస్తాడు కళ్యాణ్. .కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తాడికొండ కళ్యాణ్, కామ్రేడ్ కళ్యాణ్‌గా మారాల్సి వస్తుంది. అడవిలో అన్నలతో కలిసి పోలీసులకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుంది. ఈ కథలో స్నేహితుడు దుబాయ్ బాబు (సత్య) పాత్రేంటీ.? జాలీగా తిరిగే తాడికొండ కళ్యాణ్ ’ కామ్రేడ్ కళ్యాణ్‌గా ఎందుకు మారాడు.? తన ప్రేయసి ప్రేమను దక్కించుకున్నాడా.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!
నటీ నటుల పని తీరు:
కామెడీ కాన్సెప్టులంటే శ్రీ విష్ణుకి కొట్టిన పిండి. సబ్జెక్ట్ సీరియస్ అయినా సరే, తనకు బలమైన కామెడీ జోనర్‌లో కథనం సాగడంలో విజృంభించేశాడు. వందకు వంద మార్కలేయించుకున్నాడు. హీరోయిన్ మహిమా నంబియార్ పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. కానీ, వున్నంతలో అందంగా కనిపించి మెప్పించింది. బాలయ్య ఫ్యాన్‌గా సరస్వతమ్మ పాత్రలో రాధికా శరత్ కుమార్ ఈ మధ్య వచ్చిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమాలో తన రోల్‌కి కొనసాగింపు అయిన పాత్రలో కనిపించి మళ్లీ నవ్వించారు. ఇక సత్య నెక్స్‌ట్ లెవల్. లేటుగా ఎంట్రీ ఇస్తాడు. కానీ, వచ్చిన తర్వాత చివరి వరకూ వేేరే లెవల్ అనిపిస్తూనే నవ్విస్తాడు. హీరో విష్ణు, మరో కమెడియన్ సుదర్శన్‌తో కలిసి సత్య చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. షైన్ టామ్ చాకో రోల్ ఒకింత సీరియస్ కానీ. రావల్సిన హైప్ రాలేదు. మరో ఆర్టిస్ట్ ఉపేంద్ర ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తారు. ఇలా ఒక్కరేమిటి రఘు బాబు, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ ప్రబాస్ శీను, వెన్నెల కిషోర్, ముక్కు అవినాష్.. బోలెడంత మంది నవ్వించే ఆర్టిస్టులు.. అందరి పాత్రలకీ ప్రాధాన్యత బాగానే దక్కింది. అందుకే ఈ సినిమా కాన్సెప్ట్‌కి భిన్నంగా నవ్వించేసింది.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు జానకీ రామ్ మారెళ్ల ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటీ.? చూపించిన కథనం ఏంటీ.? అనేలానే ఈ సినిమాని డిజైన్ చేశారు. నక్సలిజం కాన్సెప్ట్‌ని కూడా ఇంత ఎంటర్‌టైనింగ్‌గా చూపించొచ్చా..! అని ఆశ్చర్యపోయేంతలా ఈ సినిమా కథనం నడిపించాడు. అస్సలు లాజిక్కులు ఆలోచించకుండా.. హాయిగా నవ్వుకోవాలంటే పైసల్ ఫుల్ వసూల్ అనేలా ఈ సినిమా కథనం వుంటుంది. ప్రధమార్ధంలో సత్య ఎంట్రీ తర్వాత ఇంగ్లీష్‌లో రాసే లవ్ లెటర్ ఎపిసోడ్ నుంచి, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఎంట్రీలతో నెక్స్‌ట్ లెవల్ నవ్వులే నవ్వుల్. ‘ఆచార్య దళం’, ‘ప్యారడైజ్ కాకి’ అంటూ శ్రీ విష్ణు చేసే నవ్వుల సందడి.. చాలా మంది సీనియర్ హీరోలు.. గత చిత్రాల రిఫరెన్సులు యూజ్ చేసి పండించిన కామెడీ.. గన్నులు, కత్తులు, షూట్ అవుట్స్.. అన్నలూ-పోలీసుల రాజకీయాలూ.. ఎత్తుకు పై ఎత్తులు.. ఇలా ఇదంతా చూస్తే ఎక్కడో చోట సీరియస్ మూడ్‌లోకి వెళ్లిపోతుందేమో అనిపిస్తుంది. కానీ, ఆ చాయలకు కథలో అస్సలు స్పేస్ ఇవ్వకుండా తాను నమ్మిన ఎంటర్టైన్‌మెంట్ జోనర్ నుంచి పక్కకి వెళ్లకుండా గుర్రానికి కళ్లాలు కట్టేసుకున్నట్లుగా తాను ఎంచుకున్న ఆర్టిస్టులందరినీ చక్కగా వాడుకుని ప్రేక్షకుడ్ని నవ్వుల ప్రపంచంలో విహరించేలా చేయడంలో దర్శకుడు జానకీ రామ్ హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. ఒక్కొక్కరుగా చెప్పడానికేముంది కానీ.. ఆల్ టెక్నికల్ టీమ్ వర్క్ సపోర్ట్ చాలా బాగుంది. దసరా హాలీడేస్‌కి ‘కామెడీ కళ్యాణ్’ .. సారీ సారీ.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్. పక్కా.!
ప్లస్ పాయింట్స్:
శ్రీ విష్ణుతో పాటూ ఆర్టిస్టులందరూ సూపర్ పర్‌పామెన్స్..ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండాఫ్ నెక్స్‌ట్ లెవల్ కామెడీ..
మైనస్ పాయింట్స్:
చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలంటే ఎంచుకోవాలి తప్ప..పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు.
చివరిగా:
‘కామ్రేడ్ కళ్యాణ్’.. కాదు కాదు ‘కామెడీ కళ్యాణ్’..దసరాకి అసలు సిసలు నవ్వుల పండగ.!
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







