ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- October 14, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మరో నామినేటెడ్ పదవిని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ మహిళా కమిషన్ మెంబర్‌గా స్వాతిరెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ అయింది. ఈ నిర్ణయంపై టీడీపీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ కార్యకర్తలకు న్యాయం జరిగిందంటూ ఆనందపడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ లీడర్స్, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అసలు ఎవరీ స్వాతిరెడ్డి...
అసలు పేరు గౌతమి శ్వేత.. ఈమె స్వాతిరెడ్డి పేరుతో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను, అప్పటి అధికార పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టేవారు. విమర్శించే వారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ, ఫోటోలు మార్ఫింగ్‌తో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. అప్పట్లో ఆమె చాలా వేధింపులను ఎదుర్కొన్నారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా టీడీపీ ఆలోచనలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు కృషి చేశారు. బెదరు లేకుండా.. భయపడకుండా... స్థిరంగా ఆమె అనుకున్నదానిపై నిలబడి ముందుకు కదిలారు.
టీడీపీ కార్యకర్తల హర్షం...
పదవి దక్కిన సందర్భంగా గతంలో స్వాతి రెడ్డి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ ఆమె ఏ మాత్రం భయపడకుండా తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్లారని ఆ పార్టీ వర్గీయులు అంటున్నారు. అప్పుడు ఆమె ప్రదర్శించిన ధైర్యానికి ఇప్పుడు సముచిత గౌరవం దక్కిందని స్వాతిరెడ్డిని ప్రశంసిస్తున్నారు. ఆమె మీద జరిగిన కుట్రలను ఛేదించి టీడీపీలో కీలక పాత్ర పోషించినందుకే పదవి దక్కిందని టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా స్వయంగా ఆమె సైబర్ వేధింపులు ఎదుర్కొన్నారు కాబట్టి.. సామాజిక మాధ్యమాల్లో మహిళల పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుందని, మహిళలను కించపరిచే విధంగా చేసే కామెంట్లు, ట్రోలింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటారని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూసేందుకు ఆమె బాధ్యతలు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







