చాక్లెట్ గులాబ్ జామున్..

- August 25, 2016 , by Maagulf
చాక్లెట్  గులాబ్ జామున్..

జామున్ పొడి - 1 కప్  
డైరీ మిల్క్ చాకలట్ - 1 
పాలు
చక్కెర
నీళ్ళు
నూనె
1 .  ముందుగ చాక్లెట్  ని కొద్ది నీళ్ళల్లో కలిపి పేస్టు లాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 
2 .  తరువాత జామున్ పొడి తో ఈ పేస్టు ని కలుపుకోవాలి.
3 . ఇప్పుడు జామున్ పొడి ప్యాకెట్  లో చెప్పిన విధముగా కొద్ది కొద్ది గా పాలు పోస్తూ ముద్ద లాగ కలుపుకోవాలి.
4 . చక్కెర పాకం 
ముందుగ రెండు గ్లాస్ ల చక్కెర లో రెండు గ్లాస్ ల నీళ్ళు కలిపి stove మీద పెట్టాలి.
చక్కెర మొత్తం కరిగే దాక కలుపుతూ ఉండాలి.
కరిగిన తరువాత ఒక 5 నిముషాల సేపు ఉంచి ఆపేయాలి.

5 . జామున్ లు చేసే విధానము 
చేసుకున్న పిండి లో కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాండలి లో డీప్  ఫ్రై  కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
అవి కాగాక అందులో చేసుకొన్నా ఉండలను కూడా వేసి వేగించాలి.
వేగిన తరువాతనే తీసి చేసుకొన్నా చక్కెర పాకం లో ఒక 5 నిముషాల పాటు ఉంచి తీయాలి.
అంతే చాక్లెట్  తో గులాబ్ జామున్ రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com