ఓంకార్‌ పివిపితో

- August 25, 2016 , by Maagulf
ఓంకార్‌ పివిపితో

ఇటీవల 'రాజుగారి గది' చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న ఓంకార్‌ తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి బ్యానర్స్‌పై పివిపి నిర్మిస్తున్నారు. ''వారాహి చలన చిత్ర సహకారంతో గతేడాది రూపొందిన 'రాజుగారి గది' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. హర్రర్‌ జోనర్‌లో ఇదొక సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓంకార్‌ దర్శకత్వంలో 'రాజుగారి గది 2' రూపొందనుంది. ఈ చిత్రానికి పివిపి సినిమా నిర్మాణ భాగస్వామ్యం కావడంతో సినిమా స్కేల్‌ పెరిగింది.పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మాతలుగా వ్యవహరిస్తారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com