ఓంకార్ పివిపితో
- August 25, 2016
ఇటీవల 'రాజుగారి గది' చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న ఓంకార్ తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్స్‌పై పివిపి నిర్మిస్తున్నారు. ''వారాహి చలన చిత్ర సహకారంతో గతేడాది రూపొందిన 'రాజుగారి గది' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. హర్రర్ జోనర్లో ఇదొక సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది 2' రూపొందనుంది. ఈ చిత్రానికి పివిపి సినిమా నిర్మాణ భాగస్వామ్యం కావడంతో సినిమా స్కేల్ పెరిగింది.పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మాతలుగా వ్యవహరిస్తారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







