రెండు బాలిస్టిక్ మిస్సైల్స్, రెండు డ్రోన్లు ధ్వంసం..!!
- October 24, 2026
రియాద్: సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌లోని హౌతీ మిలీషియా ప్రయోగించిన రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను, రెండు డ్రోన్లను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయి. రియాద్, ఖమీస్ ముషైత్ నగరాలతో పాటు దేశ దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ప్రయత్నించినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న సంకీర్ణ దళాలు వెల్లడించాయి. సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికి ఈ వివరాలను ప్రకటించారు.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలీషియా ఖమీస్ ముషైత్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్ ను సౌదీ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. మరో ప్రకటనలో రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన మరో బాలిస్టిక్ మిస్సైల్ ను కూడా అడ్డుకుని నాశనం చేసినట్లు వెల్లడించారు. అలాగే, సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతం వైపు ప్రయోగించిన రెండు డ్రోన్లను సైతం అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో పాక్షిక ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!
- కువైట్ విమానాశ్రయ రుసుములపై క్లారిటీ..!!
- సహమ్లో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదం.. హెలికాప్టర్‌తో ఆసుపత్రికి తరలింపు..!!
- ఆరు నెలల బ్రేక్..పామ్ జుమైరా లగ్జరీ హోటల్ రీ ఓపెన్..!!
- సాహల్ యాప్ ద్వారా పాస్‌పోర్టు మిస్సింగ్ ఫిర్యాదు..!!
- రెండు బాలిస్టిక్ మిస్సైల్స్, రెండు డ్రోన్లు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో భారత నూతన రాయబారికి ICRF ఘన స్వాగతం..!!
- ఖతార్‌లోని సీలైన్, ఖోర్ అల్ అదీద్ బీచ్ వద్ద రాకపోకలపై నిషేధం..!!
- దమ్మాం విమానాశ్రయ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి..!!
- మార్చి 24 నుంచి ఏప్రిల్ 3 వరకు మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన







