సాహల్ యాప్‌ ద్వారా పాస్‌పోర్టు మిస్సింగ్ ఫిర్యాదు..!!

- October 24, 2026 , by Maagulf
సాహల్ యాప్‌ ద్వారా పాస్‌పోర్టు మిస్సింగ్ ఫిర్యాదు..!!

కువైట్: పాస్‌పోర్టు పోగొట్టుకున్న నివాసితులు ఇకపై ప్రభుత్వ ఏకీకృత యాప్‌ ‘సాహల్‌’ (Sahl) ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు కువైట్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ఎలక్ట్రానిక్‌ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా పాస్‌పోర్టు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పాటు, అది పోగొట్టుకున్నట్లు ధ్రువీకరించే ఎలక్ట్రానిక్‌ సర్టిఫికెట్‌ను కూడా పొందవచ్చని ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సాహల్‌ యాప్‌లోని ‘సెక్యూరిటీ సర్వీసెస్‌’ (Security Services) విభాగం ద్వారా ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపింది.

నివాసితులు పోగొట్టుకున్న వస్తువులకు సంబంధించి ఫిర్యాదులను నమోదు చేసి, సంబంధిత అధికారులకు పంపించే సదుపాయం ఇందులో అందుబాటులో ఉందని వివరించింది. ప్రభుత్వ సేవలను మరింత విస్తరించడం, డిజిటల్‌ విధానంలో ప్రజలకు సేవలను అందించడం, నివాసితులకు అవసరమైన ప్రక్రియలను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ కొత్త సేవను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సేవ అందుబాటులోకి రావడంతో పాస్‌పోర్టు పోగొట్టుకున్న నివాసితులు ఫిర్యాదు నమోదు చేసుకోవడానికి మరింత సౌకర్యవంతమైన మార్గం అందుబాటులోకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com