ఒమన్‌లో పాక్షిక ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!

- October 24, 2026 , by Maagulf
ఒమన్‌లో పాక్షిక ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!

మస్కట్‌: ఒమన్‌లోని దోఫార్ గవర్నరేట్‌లో సలాలా–తఖా–మిర్బాత్‌ రహదారిపై పాక్షికంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ (ROP) ప్రకటించింది. ఐరన్‌మ్యాన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించనున్న ఐరన్‌మ్యాన్‌ 70.3 సైక్లింగ్‌ పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సంబంధాలు, భద్రతా సమాచార విభాగం వెల్లడించింది.

ఈ మేరకు అక్టోబర్ 24 ఉదయం సలాలా–తఖా–మిర్బాత్‌ మార్గంలో పాక్షిక రహదారి మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పోటీ నిర్వహణ సజావుగా సాగేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్‌ ఆంక్షలను గమనించి, పోలీసుల సూచనలను పాటించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com