షార్జా లో పాఠశాలలు తిరిగి ప్రారంభించేనాటికి డ్రోన్ మరియు 60 ట్రాఫిక్ గస్తీదళం

- August 27, 2016 , by Maagulf
షార్జా లో  పాఠశాలలు తిరిగి ప్రారంభించేనాటికి  డ్రోన్ మరియు 60 ట్రాఫిక్ గస్తీదళం

షార్జా: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయానికి   ట్రాఫిక్ నియంత్రించేందుకు ఒక కొత్త ట్రాఫిక్ ప్రణాళిక విధించినట్లు షార్జ పోలీస్ జనరల్ కమాండర్ పేర్కొన్నారు..ఆ కీలక సమయంలో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు 60 ట్రాఫిక్ గస్తీ దళాలను కేటాయించినట్లు  డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్ షార్జా పోలీస్  కల్నల్ అబ్దుల్లా బిన్ అమెర్ చెప్పారు.ఎమిరేట్ లో అన్ని రహదారులు అంతటా పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు  దారి తీసే అన్ని ప్రధాన విభజనలలో గస్తీ కల్పించేందుకు అమలుచేయనున్నారు..ఆకాశం నుండి విహాంగవీక్షణం పరిశీలించే  డ్రోన్ కెమెరా హెలికాఫ్టర్లు సహాయం వినియోగించుకోనున్నారు.  ట్రాఫిక్ ప్రవాహంను  నియంత్రణ మరియు ట్రాఫిక్ పరిస్థితులను  ప్రసారం చేయనుంది.పోలీస్ అవసరం వున్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను మార్గనిర్దేశం చేసేందుకు  సోషల్ మీడియా చానల్ల ద్వారా సమాజ సభ్యులు కమ్యూనికేట్ చేస్తారు.స్మార్ట్ఫోన్లు ద్వారా ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు  అనుసరించాలని  మరియు వాటికి  జారీ కాబడి ఆదేశాలని  అనుసరించమని పోలీసులు ఆయా వాహనదారులను  కోరారు. అదేవిధంగా  ట్రాఫిక్ రద్దీ ప్రారంభం కాక ముందే వారి పిల్లలను  పాఠశాలల వద్ద విడిచిపెట్టాలని పోలీసులు తల్లిదండ్రులను కోరారు.కల్నల్ బిన్ అమర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ అధికారులకు తల్లితండ్రులు సహకరించి పాఠశాలలకు పిల్లలలను  రవాణా చేసే సమయంలో మృదువైన ట్రాఫిక్ మరియు భద్రత నిర్ధారించడానికి పోలీసుల  ఆదేశాలు అనుసరించాలని అందరు కమ్యూనిటీ సభ్యులని  కోరారు. అలాగే  డ్రైవర్లు తమ మితిమీరిన అనవసర వేగంని తగ్గించుకొని ఎదురుగా ప్రయాణించే వాహనం కు  కొంచెం దూరంగా ఉండి లక్ష్యం వైపు కొనసాగాలని  మరియు ముందుగా వెళ్ళేవివాహనాన్ని తప్పుగా అధిగమించరాదని  షార్జా పోలీసులు సూచించారు. .షార్జా పోలీసులు పాఠశాలలని కూడా  సందర్శించి భద్రత పై అవగాహన వ్యాప్తి, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మరియు రద్దీ సమయంలో ఎలా సురక్షితంగా ఉండటానికి తగిన సలహాలు   విద్యార్థులకు అందించే చర్యలు తీసుకోనున్నారు..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com