హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
- October 30, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరం వాతావరణంలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులకు, సాయంత్రానికి వరుణుడు ఉపశమనం కల్పించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
వర్షం కురుస్తున్న ప్రధాన ప్రాంతాలు
ప్రస్తుతం శంషాబాద్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లితో పాటు కాప్రా, ఘట్‌కేసర్, కీసర, దమ్మాయిగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, చర్లపల్లి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అలాగే పశ్చిమ మరియు దక్షిణ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ, మణికొండ, షేక్‌పేట్, టోలీచౌకి, నాగోల్, ఎల్‌బీ నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా వాన దంచికొడుతోంది.
ట్రాఫిక్ అంతరాయం – ప్రయాణికుల ఇబ్బందులు
సరిగ్గా ఉద్యోగాలు ముగించుకుని ప్రజలు ఇళ్లకు బయలుదేరే సమయం కావడంతో రోడ్లపై వాహనాల రద్దడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్ వంటి ప్రధాన ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులు వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యూఏఈ: జాతీయ సైనిక సేవ నుంచి తప్పించేందుకు సహకారం..పలువురు అధికారులపై విచారణ
- హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
- అటల్ జీ జీవితం, భాషాభిమానం, జాతీయవాదం, సుపరిపాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకం: వెంకయ్యనాయుడు
- సైబరాబాద్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’.. నగర రవాణా భవిష్యత్తు పై ప్రత్యేక ప్రదర్శన
- నవంబర్‌లో బ్యాంకులకు ఇన్ని సెలవులా?
- ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించింది ఫ్రాన్స్..!!
- గ్లోబల్ విలేజ్‌లో 700 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన..!!
- ఖతార్ నేషనల్ థియేటర్ రెనోవేషన్ పనులు ప్రారంభం..!!
- కువైట్‌లో డెలివరీ బైక్‌లపై ప్రత్యేక తనిఖీలు..!!







