ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుడ్ డెలివరీ రైడర్ మృతి..!!
- October 31, 2026
ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుడ్ డెలివరీ రైడర్ మృతి..!!
యూఏఈ: ఫుజైరాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆసియా దేశానికి చెందిన ఫుడ్ డెలివరీ రైడర్ ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై నిలిపి ఉంచిన ట్రక్కును అతను ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఏడాది ఫుజైరా ఎమిరేట్‌లో నమోదైన ఐదో రోడ్డు ప్రమాద మరణం ఇదని అధికారులు తెలిపారు. అక్టోబర్ 30న ఉదయం 8.05 గంటలకు ఫుజైరా–ఖోర్ ఫక్కాన్ రహదారిపై ఫౌజ్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన రైడర్‌ను షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భారీ వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
నిలిపి ఉంచిన ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు రోడ్డుపై ప్రయాణించే వారికి తీవ్ర ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఫుజైరా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సలేహ్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ దన్హానీ హెచ్చరించారు. రోడ్డుపై పరిస్థితులను నిరంతరం గమనించాలని, నిలిపి ఉంచిన వాహనాల సమీపంలోకి వెళ్లేటప్పుడు వేగాన్ని తగ్గించాలని, అకస్మాత్తుగా ఎదురయ్యే అడ్డంకులను నివారించేందుకు తగినంత దూరం పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లేదా రైడింగ్ సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగం, ఆకస్మికంగా లేన్లు మార్చడం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ఈ నెల ప్రారంభంలోనూ ఫుజైరాలో 24 ఏళ్ల భారతీయ ప్రవాసుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెళ్తుండగా ఎస్‌యూవీ ఢీకొని మృతి చెందాడు. అనుమతి లేని ప్రదేశంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించడమే ప్రమాదానికి కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.
డెలివరీ రైడర్లకు అవగాహన కార్యక్రమాలు
డెలివరీ రైడర్ల భద్రత కోసం ఫుజైరా పోలీసులు మున్సిపాలిటీ సహకారంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతివేగం, ప్రమాదకర ఓవర్‌టేకింగ్, ఆకస్మిక మలుపులు, రైడింగ్ సమయంలో నిర్లక్ష్యం వంటి అంశాలపై వారికి సూచనలు చేస్తున్నారు. మోటార్‌సైకిల్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రక్షణాత్మక డ్రైవింగ్ పద్ధతులను అనుసరించాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా, తనిఖీలను కూడా పెంచినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాస డ్రైవర్లకు దేశ బహిష్కరణ ముంపు?
- మనామా డైలాగ్ 2026..సముద్ర భద్రతపై చర్చలు..!!
- ఒమన్‌లో క్యాన్సర్‌పై అవగాహనకు భారీ వాక్‌థాన్..!!
- ప్రాంతీయ భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి కీలక చర్చలు..!!
- కువైట్‌లో ఉద్యోగులకు ఊరట..!!
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుడ్ డెలివరీ రైడర్ మృతి..!!
- యూఏఈలో వాహనదారులకు ఊరట.. నవంబర్‌లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఇరాన్‌పై ట్రంప్ మరో దాడికి సిద్ధమా?
- వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నియామకం..షేక్ అబ్దుల్లాకు సలహాదారు బాధ్యతలు
- సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: కేంద్ర మంత్రి జైశంకర్







