వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నియామకం..షేక్ అబ్దుల్లాకు సలహాదారు బాధ్యతలు
- October 31, 2026
దుబాయ్‌కు చెందిన షేక్ అబ్దుల్లాకు సలహాదారు బాధ్యతలు.. కువైట్‌కు చెందిన షా హుస్సేన్, ఎ.లాజరస్‌కు కమిటీలో స్థానం
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) గల్ఫ్ కమిటీని నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం 2026 అక్టోబర్ 30న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఈ కమిటీ కో-కన్వీనర్‌గా కువైట్‌కు చెందిన నాయని మహేశ్వర్ రెడ్డిని నియమించారు. సలహాదారులుగా దుబాయ్‌కు చెందిన షేక్ అబ్దుల్లా, కువైట్‌కు చెందిన షా హుస్సేన్‌ను నియమించారు. కోర్ కమిటీ సభ్యుడిగా కువైట్‌కు చెందిన ఎ. లాజరస్‌కు బాధ్యతలు అప్పగించారు.
గల్ఫ్‌లో పార్టీ కార్యకలాపాల పై దృష్టి
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, వైఎస్సార్సీపీ మద్దతుదారులతో సమన్వయం చేసుకోవడం, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. గల్ఫ్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రవాసాంధ్రుల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాల పై దృష్టి సారించేందుకు ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కువైట్, యూఏఈల్లో పార్టీ కార్యకలాపాల సమన్వయానికి అనుభవజ్ఞులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా గల్ఫ్‌లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు వైఎస్సార్సీపీ నాయకత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు
- వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నియామకం..షేక్ అబ్దుల్లాకు సలహాదారు బాధ్యతలు
- సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: కేంద్ర మంత్రి జైశంకర్
- IIFA అవార్డ్స్‌లో ‘ధురంధర్’ హవా
- యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!!
- హార్ముజ్ లో గాయపడిన భారతీయుడు మస్కట్‌కు తరలింపు..!!
- కెన్యాకు ప్రయాణంపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త నిబంధనలు?
- ఖతార్ రియల్ ఎస్టేట్‌లో మారుతున్న ఇన్వెస్టర్ల ధోరణి..!!
- గడువు తేదీల్లో అక్రమ మార్పులు.. 27 మంది అరెస్ట్..!!







