కువైట్‌లో ఉద్యోగులకు ఊరట..!!

- October 31, 2026 , by Maagulf
కువైట్‌లో ఉద్యోగులకు ఊరట..!!

కువైట్: ప్రైవేటు రంగ ఉద్యోగుల వేతనాలు, జీతాల నుంచి చేసే కోతలకు సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) కీలక నిబంధనలను మరోసారి గుర్తుచేసింది. కార్మికుల ఆర్థిక హక్కులను కాపాడేందుకు లేబర్ చట్టంలోని నిబంధనలను యజమానులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

లేబర్ చట్టంలోని ఆర్టికల్ 28 ప్రకారం.. ఉద్యోగ ఒప్పందంలో అంగీకరించిన వేతనాన్ని ఒప్పందం అమల్లో ఉన్నంతకాలం తగ్గించడానికి వీల్లేదు. అలాగే ఆర్టికల్ 59 (A) ప్రకారం.. యజమాని వద్ద ఉద్యోగి తీసుకున్న అప్పులు లేదా రుణాల చెల్లింపు కోసం నెలవారీ జీతం నుంచి గరిష్ఠంగా 10 శాతం మాత్రమే మినహాయించాలి. అంతేకాకుండా ఈ రుణాలపై యజమానులు ఎలాంటి వడ్డీ వసూలు చేయకూడదు.

ఇక ఆర్టికల్ 59 (B) ప్రకారం.. అప్పుల చెల్లింపు కోసం ఉద్యోగి జీతం నుంచి చేసే జప్తులు, బదిలీలు లేదా ఇతర మినహాయింపులు మొత్తం వేతనంలో 25 శాతానికి మించకూడదు. ఇందులో యజమానికి చెల్లించాల్సిన అప్పులు కూడా ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ రకాల బకాయిలు ఉన్నప్పుడు భరణం (Alimony) చెల్లింపులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని PAM స్పష్టం చేసింది.

కార్మికుల వేతన భద్రతను కాపాడటం, యజమానులు కార్మిక చట్టాలను ఉల్లంఘించకుండా చూడటమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com