మనామా డైలాగ్ 2026..సముద్ర భద్రతపై చర్చలు..!!

- October 31, 2026 , by Maagulf
మనామా డైలాగ్ 2026..సముద్ర భద్రతపై చర్చలు..!!

మనామా: బహ్రెయిన్‌లో నిర్వహించిన 22వ మనామా డైలాగ్ 2026 సదస్సులో ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దులజీజ్ బిన్ సాలెహ్ అల్ ఖులైఫీ పాల్గొన్నారు. ‘ మిడిలిస్ట్ భద్రతా ప్రయోజనాలు, కూటములు, సమగ్రత’ అనే థీమ్ తో ఈ సదస్సు నిర్వహించారు. ప్రాంతీయ ఘర్షణల ప్రభావాలు, వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, మధ్యప్రాచ్యంలో భద్రతా సమన్వయం, సముద్ర భద్రత, అంతర్జాతీయ నౌకాయానానికి రక్షణ వంటి కీలక అంశాలపై ఇందులో చర్చించారు.

అలాగే రక్షణ విధానాల్లో మార్పులు, దేశాల రక్షణ సామర్థ్యం, సంక్షోభాలను ఎదుర్కొనే సన్నద్ధత, నిరోధక వ్యూహాలు, నూతన ఆర్థిక అజెండాపైనా సదస్సులో చర్చలు జరిగాయి. సదస్సు సందర్భంగా ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి పలువురు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com