సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్.. యువతి అరెస్ట్..!!
- November 10, 2026
బహ్రెయిన్: సోషల్ మీడియాలో పబ్లిక్ మోరల్స్ కు విరుద్ధంగా కంటెంట్‌ను ప్రచురించినట్లు ఆరోపణలు రావడంతో 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీలోని సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అధికారులు ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది..
యువతి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలను పరిశీలించిన అధికారులు.. ఆమె దుస్తులు ప్రజా నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను పోస్టు చేసే సమయంలో సామాజిక, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని, చట్టాలకు లేదా దేశ సంప్రదాయాలకు విరుద్ధమైన సమాచారాన్ని ప్రచురించడం, ఇతరులకు షేర్ చేయడం వంటివి నివారించాలని కోరింది.
తాజా వార్తలు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!
- ట్రంప్ సంచలన నిర్ణయం..
- విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా
- యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్.. యువతి అరెస్ట్..!!
- ఒమన్ డేమానియాత్ దీవుల్లో అండర్‌వాటర్ మ్యూజియం..!!
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా







