విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా

- November 10, 2026 , by Maagulf
విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక అధికారిక నోట్‌ను విడుదల చేశారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయం పూర్తిగా పరస్పర సమ్మతితో తీసుకున్నదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా కొనసాగిన దాంపత్య బంధాన్ని ముగిస్తున్నప్పటికీ, ఒకరి పై మరొకరికి గౌరవం ఉంటుందని వారి ప్రకటన ద్వారా వెల్లడైంది. ఈ పరిణామం రాజకీయ, సినీ వర్గాలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మంచి స్నేహితులుగా.. బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతాం

విడాకుల నిర్ణయం తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో తాము మంచి స్నేహితులుగా, బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతామని పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా తమ ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లల పట్ల తమ బాధ్యతలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియా, అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. తమ ప్రయాణంలో ఇప్పటివరకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన నోట్‌ను జనసేన పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com