తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- November 10, 2026
రియాద్: మిడిలిస్టులో తాజా పరిణామాలు, ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణపై సౌదీ అరేబియా, ఒమన్ విదేశాంగ మంత్రులు చర్చించారు. సోమవారం సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో ఫోన్లో మాట్లాడారు.
ఈ సందర్భంగా మిడిలిస్టులో వేగంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరువురు మంత్రులు అభిప్రాయాలను పంచుకున్నారు. సంక్షోభాన్ని అదుపులోకి తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరాన్ని చెప్పారు.
అలాగే అంతర్జాతీయ సముద్ర రవాణా, నౌకాయాన మార్గాలకు భద్రత కల్పించడం, తాజా పరిణామాల ప్రభావం ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై పడకుండా చర్యలు తీసుకోవడంపై చర్చించారు. సంక్షోభ పరిష్కారానికి దౌత్య మార్గాలే కీలకమని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!
- ట్రంప్ సంచలన నిర్ణయం..
- విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా
- యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్.. యువతి అరెస్ట్..!!
- ఒమన్ డేమానియాత్ దీవుల్లో అండర్వాటర్ మ్యూజియం..!!
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా







