‘డార్క్ చాక్లెట్’లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం: హీరో విశ్వదేవ్ రాచకొండ
- November 10, 2026
రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్' చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు.
హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇది ఎంతో ప్యాషన్‌తో చాలా డీటెయిల్డ్‌గా బిల్డ్ చేసిన సినిమా. సినిమా విషయంలో మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే, దానిపై మాకున్న నమ్మకమే కారణం. కచ్చితంగా ఒక మంచి సినిమాను తీశాం. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థాంక్యూ. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా ఇది. ఇది ఒక కొత్త సినిమా. ఇప్పటివరకు ఈ సినిమా చూసినవాళ్లు మర్చిపోలేకపోతున్నారు. మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. మేము కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం. అది మీరు నవంబర్ 13న చూడబోతున్నారు. ఇది రొటీన్ సినిమా కాదు. సినిమా అనే ఫార్మాట్‌కే ఛాలెంజ్ చేసేంత కొత్తగా శశాంక్ ఈ కథను రాశారు. కచ్చితంగా మీరు ఒక కొత్త సినిమాను చూడబోతున్నారు. ఎవరూ ఈ సినిమాను థియేటర్లలో మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్ రవికాంత్ మాట్లాడుతూ: టీమ్ అందరికీ అభినందనలు. శశాంక్ కథ చెప్పే విధానం, నటీనటులను ఎంపిక చేసుకునే విధానం చాలా కొత్తగా ఉన్నాయి. విశ్వదేవ్ 35 చేయడం చాలా గర్వంగా ఉంది. శశాంక్ చాలా యూనిక్ టేస్ట్ ఉన్న ఫిల్మ్‌మేకర్. చాలా మంచి కన్విక్షన్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. మేమందరం వైజాగ్ నుంచి వచ్చాం. ఈ సినిమా అందరూ గర్వపడేలా ఉంటుందని కచ్చితంగా నమ్ముతున్నాను.
డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ: ముందుగా రెండు నేషనల్ అవార్డులు అందుకున్న విశ్వదేవ్కు అభినందనలు. ఇది మామూలు విషయం కాదు. బిందు మాధవి గారు చాలా మంచి పెర్ఫార్మర్. విశ్వదేవ్ చాలా వెర్సటైల్ యాక్టర్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మల్లిక్ రామ్ మాట్లాడుతూ: శశాంక్ ఈ సినిమాతో దర్శకుడిగా రావడం చాలా ఆనందంగా ఉంది. తన కథలు చాలా యూనిక్‌గా ఉంటాయి. ఇప్పుడు వస్తున్న ఈ కథ కూడా చాలా కొత్తగా ఉంది. విశ్వదేవ్ చాలా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా బ్రిలియంట్‌గా ఉండబోతోంది.
బిందు మాధవి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ వారం విడుదలవుతున్న సినిమాలన్నీ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ‘డార్క్ చాక్లెట్’ చాలా కొత్త తరహా సినిమా. యూఎస్‌లో ముందుగానే రిలీజ్ అవుతుంది. సినిమా చూసినవాళ్లు జెన్యూన్‌గా రివ్యూ ఇవ్వండి. మా కంటెంట్‌పై మాకు చాలా నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ: నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్యూ. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలని సినిమా చూసిన చాలామంది అంటున్నారు. కాకపోతే ఈ కథ రాసినప్పుడు నాకు ఆ విషయం తెలియదు. విశ్వదేవ్ లేకపోతే ఈ జర్నీ సాధ్యపడేది కాదు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ థాంక్యూ. బిందు తన పాత్రను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. విశ్వదేవ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. వివేక్ సాగర్ అద్భుతమైన, మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చారు. టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్యూ. ఒక తెలుగు సినిమా మూడు రోజుల ముందే యూఎస్‌లో రిలీజ్ అవుతోంది. అందుకే ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఈ విషయంలో చాలా గర్వంగా ఉంది. నవంబర్ 13న సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ 28వ వార్షికోత్సవం..
- యూఏఈ ప్రాదేశిక జలాల్లో నౌకపై దాడి.. దెబ్బతిన్న ADNOC నౌక
- 2027 నుంచి సౌదీ అరేబియాలో అల్ట్రా లగ్జరీ ఎడారి రైలు..బుకింగ్స్ ప్రారంభం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- అన్నవరం గిరి ప్రదక్షిణ గీతం ఆవిష్కరణ-డా.గజల్ శ్రీనివాస్
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా డీఎస్పీలు విధులు నిర్వహించాలి: సీఎం రేవంత్
- 14, 15 తేదీల్లో ఈదురుగాలులు.. జాగ్రత్త
- తెలంగాణ గవర్నర్‌తో కర్ణాటక గవర్నర్ మర్యాదపూర్వక భేటీ
- మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక విభాగం.. గచ్చిబౌలిలో నూతన భవనం ప్రారంభం
- జెడ్డాలో తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం..సంప్రదాయాలు, కళా వైభవాన్ని చాటిన వేడుకలు







