ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!
- November 11, 2026
మనామా: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రైవేట్ సంస్థలకు ఊరట కల్పించే కీలక ప్రతిపాదనకు బహ్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. వ్యాపార సంస్థలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించడంతో పాటు, ఇప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపులను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎంపీ అబ్దుల్‌వాహెద్ ఖరాటా మరో నలుగురు ఎంపీలతో కలిసి ఈ అత్యవసర ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (SMEs) ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతాపరమైన పరిస్థితుల కారణంగా మార్కెట్లో కొనుగోళ్లు, వినియోగదారుల డిమాండ్ తగ్గాయని, దీంతో వ్యాపార సంస్థల ఆదాయాలు పడిపోయి ఆర్థిక ఒత్తిడి పెరిగిందని ఎంపీ ఖరాటా తెలిపారు. కొన్ని సంస్థలు ఉద్యోగుల జీతాలు, అద్దెలు, సరఫరాదారుల బిల్లులు, బ్యాంకు వాయిదాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీతో అత్యవసర రుణాలు అందించాలని, రుణాల తిరిగి చెల్లింపు గడువును పొడిగించాలని ఎంపీలు ప్రతిపాదించారు.
అంతేకాకుండా, అవసరమైతే వడ్డీ రేట్లను తగ్గించడం లేదా కొంత వడ్డీని ప్రభుత్వమే భరించేలా చూడాలని సూచించారు. తీవ్రంగా నష్టపోయిన సంస్థలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ వాయిదాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా చెల్లింపు గడువును మరింత పొడిగించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ ఫీజులు, ఇతర చెల్లింపుల విషయంలోనూ సంస్థల ఆర్థిక పరిస్థితిని బట్టి తాత్కాలిక మినహాయింపులు లేదా వెసులుబాట్లు కల్పించాలని సూచించారు. రుణాల మంజూరు ప్రక్రియను సరళీకరించి, నిర్ణయాలను వేగంగా తీసుకోవాలని కూడా ఎంపీలు కోరారు.
అయితే రుణాల మంజూరులో అవసరమైన ఆర్థిక తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగాలని స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలకు సకాలంలో ఆర్థిక సహాయం అందకపోతే ఉద్యోగాల కోత, వ్యాపార కార్యకలాపాల తగ్గింపు, చివరకు సంస్థల మూసివేత వంటి పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఎంపీలు హెచ్చరించారు. దీనివల్ల బహ్రెయిన్‌లో ఉపాధి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ
- రేపటి నుంచి హైదరాబాద్ లో ‘భారత్ సమ్మిట్’
- వైజాగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!







