ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ

- November 11, 2026 , by Maagulf
ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం కలకలం రేగింది. ముంబైకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తామంటూ వచ్చిన హెచ్చరిక దీనికి కారణమైంది. విమానంలోని ఒక మరుగుదొడ్డి అద్దంపై హైజాక్‌కు సంబంధించిన బెదిరింపు సందేశం రాసి ఉండటాన్ని గుర్తించినట్లు సమాచారం. విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ బెదిరింపు సందేశం కనిపించింది. విషయం తెలిసిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని అప్రమత్తం చేశారు.

ప్రత్యేక భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు

దీంతో ఆ విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి (ఐసోలేషన్ బే) తరలించారు. అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మరియు ప్రత్యేక భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయేమోనని విమానంలోని ప్రతి భాగాన్ని పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు సందేశాన్ని ఎవరు రాశారు, దీని వెనుక ఎవరి హస్తం ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు మరియు భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. విమానాశ్రయ ప్రాంగణంలో మరియు విమానం లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com