మక్కా గ్రాండ్ మసీదులో ఉచిత సేఫ్టీ బ్రేస్లెట్లు..!!
- November 16, 2026
మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదును సందర్శించే చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల భద్రత కోసం ప్రత్యేక సేఫ్టీ బ్రేస్లెట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రద్దీ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా తప్పిపోయినప్పుడు వారిని సులభంగా గుర్తించి, తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ఈ సేవ ఉపయోగపడనుంది. గ్రాండ్ మసీదు, ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ జనరల్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ బ్రేస్లెట్లను విజిటర్స్ కు ఉచితంగా అందిస్తున్నారు. గెస్ట్ కేర్ సెంటర్ల ద్వారా పొందగలిగే ఈ బ్రేస్లెట్లపై సంబంధిత వ్యక్తిని గుర్తించేందుకు అవసరమైన వివరాలు ఉంటాయి. ఎవరైనా తమ కుటుంబ సభ్యుల నుంచి విడిపోయినప్పుడు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది బ్రేస్లెట్లోని వివరాల ఆధారంగా వారిని గుర్తించి, అవసరమైతే కుటుంబ సభ్యులను సంప్రదిస్తారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రార్థనా సమయాల్లో చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా గుర్తించేందుకు ఈ సేవ ఎంతో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.
విజిటర్స్ భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, అందుబాటులో ఉండే వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు ఈ సేవ దోహదపడనుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో కొత్త ఆరోగ్య సముదాయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కా గ్రాండ్ మసీదులో ఉచిత సేఫ్టీ బ్రేస్లెట్లు..!!
- యూఏఈలో 2027లో తగ్గనున్న కొత్త నియామకాలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల చేపల విక్రయాలపై నిషేధం..!!
- బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!
- సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!
- కువైట్‌లో వాహన బీమా పాలసీలకు కొత్త నిబంధనలు..!!
- ఖతార్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్‌లో OMR100 మిలియన్ల బాండ్ల జారీ..!!







