బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో బాంబు కలకలం
- August 29, 2016
బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో బాంబు దాడి కలకలం సృష్టించింది. బ్రసెల్స్ ఉత్తర ప్రాంతంలోని 'బ్రసెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ'ని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సోమవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో దుండగుల కారు రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాటుకొని ఇనిస్టిట్యూట్ లోకి ప్రవేశించిందని అధికారులు వెల్లడించారు. వారు నేరుగా క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్ లాబొరేటరీపైకి బాంబులు విసరడంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఘటనలో ఎంతమంది వ్యక్తులు పాల్గొన్నారన్న విషయం తెలియరాలేదు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది ఉగ్రవాదుల చర్యనా లేక మరెవరైన ఈ దాడికి పాల్పడి ఉంటారా అన్న కోణంలో విచారణ జరుతుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







