రిలయన్స్‌ జియో 4జీ నెట్‌వర్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌..

- August 29, 2016 , by Maagulf
రిలయన్స్‌ జియో 4జీ నెట్‌వర్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌..

రిలయన్స్‌ జియో 4జీ నెట్‌వర్క్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ సిద్ధమైంది. ఎయిర్‌టెల్‌ 4జీ, 3జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ ధరలను తగ్గించింది. ప్రత్యేక స్కీంలో భాగంగా రూ.51కే 1జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ స్కీం వర్తించేందుకు రూ.1498తో మొదట రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.51తో రీఛార్జ్‌ చేస్తే 28 రోజుల వాలిడిటీతో 1జీబీ 3జీ/4జీ డేటా వస్తుంది. ఇలా 12 నెలల్లో ఎన్నిసార్లైనా ఈ స్కీం కింద రూ.51తో రీఛార్జి చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.అలాగే ఎయిర్‌టెల్‌ మరో స్కీం కూడా పెట్టనుంది. రూ.748తో రీఛార్జ్‌ చేయించుకుంటే ఆరు నెలల పాటు వర్తిస్తుంది.ఈ ఆర్నెల్లలో రూ.99తో రీఛార్జ్‌ చేయిస్తే 1జీబీ 3జీ/4జీ డేటా వస్తుంది. ఈ ప్రీపెయిడ్‌ ప్యాక్‌లు ప్రస్తుతం దిల్లీలో అందుబాటులో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో అన్ని సర్కిల్స్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఐడియా, వొడాఫోన్ల దారిలోనే జులైలో ఎయిర్‌టెల్‌ కూడా 4జీ, 3జీ డేటా ప్లాన్స్‌లో వినియోగించుకునే డేటాను పెంచింది.అలాగే ఎయిర్‌టెల్‌ ఇటీవల రూ.1,199కి 1జీబీ 3జీ/4జీ డేటా ప్లాన్‌లో రోమింగ్‌లో కూడా వాయిస్‌ కాలింగ్‌ ఉచితంగా అందించే ఆఫర్‌ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com