కూల్ రాఖీ కూల్ చిత్రం పోస్టర్, టైటిల్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్
- November 26, 2026
ఇంక్ స్పైర్ స్టూడీయోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం కూల్ రాఖీ కూల్ పోస్టర్స్, టైటిల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహ్మద్ సాయిద్ సమి రచన, ఎడిటింగ్, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని చిత్రయూనిట్ వెల్లడించింది.
కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ హీరో, దర్శకుడు, నిర్మాత, రచయిత, ఎడిటర్‌గా అన్ని బాధ్యతలు సమి ఒక్కరే నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు. చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చిన సమి, కుటుంబ మద్దతుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని, యువ తరం టాలెంట్‌ను ఆదరించాలని కోరుకున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు కూడా చూపించారని, చిత్రం పెద్ద హిట్ కావాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సమి తన జీవితం, స్నేహితుల అనుభవాల ఆధారంగా స్క్రిప్ట్ రాశారని, కర్నూల్ నేపథ్యం, స్థానిక యాస, స్లాంగ్‌తో చిత్రం రూపొందుతోందని వివరించారు. హీరోయిన్ బెంగళూరు నుంచి వచ్చిన కన్నడిగ అని, తెలుగు నేర్చుకుంటున్నారని ప్రస్తావించారు. నిర్మాతలు, టెక్నీషియన్లు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి ఎస్ ఖుస్నుమ మాట్లాడుతూ కొడుకు కృషికి మద్దతు ఇచ్చినట్లు, చిత్రం హిట్ కావాలని ఆశీర్వదించారు.
ప్రశ్న: రియల్ స్టోరీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది? ప్రస్తుత సొసైటీలోని రిలేషన్షిప్స్, ఘోస్టింగ్ వంటివి ఎలా చూపించారు?
సమాధానం: ఇది మా ఫ్రెండ్స్ నిజమైన కథ. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న రిలేషన్షిప్స్, లవ్ స్టోరీలు, ఘోస్టింగ్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. దాని బేస్‌పైనే తీశాం కాబట్టి మాక్సిమం యూత్ అంతా కనెక్ట్ అవుతారని 100% కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
ప్రశ్న: మీరే డైరెక్టర్, యాక్టర్, ఎడిటర్. ఈ మూడింటిలో ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? డైరెక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యారా?
సమాధానం: ఈ ఎమోషన్‌ను ఎవరూ సరిగ్గా క్యారీ చేయలేరని అనిపించి నన్ను నేనే చూసుకున్నా. ట్రూ స్టోరీ కాబట్టి నేనే చేద్దామని ఫిక్స్ అయి నేనే చేశా. ఎవరినీ అప్రోచ్ కాలేదు.
ప్రశ్న: మదర్ ప్రొడక్షన్ చేశారు. బడ్జెట్ ఎలా మేనేజ్ చేశారు? రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా?
సమాధానం (మదర్): డబ్బు శాశ్వతం కాదు. తను ఒక స్టేజ్‌లో నిలబడాలని పెట్టాను. డిగ్రీ తర్వాత ఏదో చేయమన్నా, తను షార్ట్ ఫిల్మ్‌లు తీస్తూ టాలెంట్ చూపించాడు కాబట్టి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ప్రాఫిట్-లాస్ గురించి ఆలోచించలేదు; సినిమా అందరికీ చేరితే చాలు, టాలెంట్ చూపించాలని కోరిక.
ప్రశ్న: సినిమాలో 18+ సీన్స్, అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయని చెప్పారు. ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడానికేనా?
సమాధానం: అలా ఏం లేదు. 18+ అంటే జస్ట్ డైలాగ్స్ మాత్రమే, సీన్స్ ఏమీ ఉండవు. మనిషికి ఎమోషన్ వచ్చినప్పుడు పచ్చిగా మాట్లాడతారు. రియల్ ఎమోషన్ క్యారీ అవ్వాలని పచ్చి మాటలు పెట్టాం. జెన్‌జీ జనరేషన్లో ఇవి కామన్. ఆడియన్స్‌ను టార్గెట్ చేయడం కాదు.
ప్రశ్న:టైటిల్ ‘కూల్ రాకీ కూల్’కు జస్టిఫికేషన్ ఏమిటి? స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుంది?
సమాధానం: దీనికి చిన్న స్టోరీ ఉంది. దుబాయ్ సీను మూవీలో రవితేజ హోటల్ సీన్లో బ్రహ్మానందం ఫ్రస్ట్రేషన్లో ‘కూల్ రాకీ కూల్’ అని చెప్పే డైలాగ్ మీమ్ అయింది. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కూడా మాక్సిమం ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. ఫ్రెండ్స్ ‘కూల్ రాకీ కూల్, ఎందుకు అంత టెన్షన్?’ అని చెబుతుంటారు. క్యారెక్టర్ పేరే రాకీ కాబట్టి ఆ డైలాగ్ ఎక్కువసార్లు రిపీట్ అవ్వడంతో టైటిల్ పెట్టేశా.
ఈ సినిమా డార్క్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఎమోషనల్ జంప్స్ ఉండేలా, ఫ్రెండ్స్ ఎమోషన్, లవ్ స్టోరీ రెండూ పారలల్‌గా చూపిస్తుందని టీమ్ చెప్పింది. అందరూ కొత్త ముఖాలు, స్వంత ఫ్రెండ్స్ సర్కిల్తోనే తీశారు. టైటిల్, రియల్ స్టోరీ, యూత్ కనెక్ట్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చిత్రం: కూల్ రాఖీ కూల్
నటీనటులు : మహ్మద్ సాయీద్ సమి, చాయా దేవి, దానా ప్రకాష్ , గిరి బాబు , రంగా రెడ్డి
అశ్వంత్ గోసుకొండ
రచన-దర్శకత్వం : మహ్మద్ సాయిద్ సమి
నిర్మాత : ఎస్ ఖుస్నుమ, మళ్లేశ్వరుడు
సంగీతం : పవన్
సినిమాటోగ్రఫీ : అరవింద్
ఎడిటర్ : మహ్మద్ సాయిద్ సమి
ఎక్స్ గ్యూటీవ్ ప్రొడ్యూసరం : వంచ అనీల్ రెడ్డి
పీఆర్ఓ: అప్పరాల హరీష్
తాజా వార్తలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
- ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!
- దుబాయ్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ విస్తరణకు భారీ ముందడుగు..!!
- ఖతార్‌లో ఆన్లైన్ అపాయింట్మెంట్ సదుపాయం..!!
- కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు
- యూఏఈలో గత 20 ఏళ్లలో జరిగిన మేజర్ యాక్సిడెంట్స్ ఇవే..!!
- వాట్సప్‌లో సరికొత్త ఫీచర్..ఇక మెసేజ్‌లు ఒక్కసారే చూడొచ్చు!







