దుబాయ్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ విస్తరణకు భారీ ముందడుగు..!!
- November 26, 2026
దుబాయ్: దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి మరో భారీ ముందడుగు పడింది. విమానాశ్రయ అభివృద్ధి పనుల కోసం తాజాగా Dh56.5 బిలియన్ల విలువైన కాంట్రాక్టులను కేటాయించినట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు కేటాయించిన మొత్తం కాంట్రాక్టుల విలువ Dh80 బిలియన్లకు పైగా చేరింది. దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ కాంట్రాక్టులు ఖరారు చేసినట్లు షేక్ హమ్దాన్ తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యుత్తమ విమానాశ్రయంగా అల్ మక్తూమ్ను అభివృద్ధి చేసే ప్రణాళికలో ఇది మరో కీలక దశ అని ఆయన ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టు పనుల్లో ప్రస్తుతం 14,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ విమానాశ్రయం ఏటా 260 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా ప్రపంచ విమానయాన రంగంలో దుబాయ్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.
ప్రస్తుతం అల్ మక్తూమ్ విమానాశ్రయంలో Dh13 బిలియన్లకు పైగా విలువైన పనులు కొనసాగుతున్నాయి. దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం 2032లో విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూన్‌లోనే తదుపరి దశలో Dh55 బిలియన్లకు పైగా విలువైన కాంట్రాక్టులు కేటాయించనున్నట్లు దుబాయ్ మీడియా కార్యాలయం ప్రకటించింది.
విమానాశ్రయం పూర్తయిన తర్వాత ఐదు సమాంతర రన్వేలు స్వతంత్రంగా పనిచేయనున్నాయి. రెండు ప్యాసింజర్ టెర్మినల్స్, వాటితో అనుసంధానమైన ఏడు కాన్కోర్స్లు, 430కి పైగా విమానాల పార్కింగ్ స్టాండ్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల రవాణా కోసం ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (APM) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. విమాన, రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలను అనుసంధానించేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయ విమాన ప్రయాణాలతో పాటు వాణిజ్యం, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లోనూ దుబాయ్ ప్రపంచ స్థాయి కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనుందని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
- ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!
- దుబాయ్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ విస్తరణకు భారీ ముందడుగు..!!
- ఖతార్‌లో ఆన్లైన్ అపాయింట్మెంట్ సదుపాయం..!!
- కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు
- యూఏఈలో గత 20 ఏళ్లలో జరిగిన మేజర్ యాక్సిడెంట్స్ ఇవే..!!
- వాట్సప్‌లో సరికొత్త ఫీచర్..ఇక మెసేజ్‌లు ఒక్కసారే చూడొచ్చు!







