ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న కువైట్.. నలుగురికి గాయాలు

- November 26, 2026 , by Maagulf
ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న కువైట్.. నలుగురికి గాయాలు

కువైట్: కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన శత్రు డ్రోన్లను అడ్డుకునే క్రమంలో వాటి శకలాలు కిందపడటంతో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక కువైట్ పౌరుడు, ఇద్దరు ఇటలీ పౌరులు, ఒక పాకిస్థాన్ పౌరుడు గాయపడినట్లు కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది.

కువైట్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి స్టాఫ్ కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఇరాన్ నుంచి కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన పలు అనుమానాస్పద డ్రోన్లను దేశ సాయుధ దళాలు గుర్తించాయి. వెంటనే స్పందించిన సైన్యం వాటిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది.

ఈ డ్రోన్ దాడులు ఓ కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్లను అడ్డుకునే సమయంలో వాటి శకలాలు కిందపడటంతో నలుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనలో ఆస్తి నష్టం కూడా సంభవించినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com