హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. గల్లంతైన సిబ్బంది మృతి: ADNOC ప్రకటన
- November 26, 2026
11 మందికి గాయాలు.. తొమ్మిది మందికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
అబుదాబి: హార్ముజ్ జలసంధిలో నవంబర్ 17న ADNOC లాజిస్టిక్స్ అండ్ సర్వీసెస్ (ADNOC L&S)కు చెందిన నౌకపై జరిగిన దాడిలో గల్లంతైన జోర్డాన్ దేశానికి చెందిన సిబ్బంది మృతి చెందినట్లు సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది.
ఈ ఘటన అనంతరం గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టగా, తాజాగా అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు ADNOC L&S వెల్లడించింది. అతడి మరణవార్తను తీవ్ర విచారంతో ప్రకటిస్తున్నామని, ఈ కష్ట సమయంలో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవిస్తూ మృతుడికి సంబంధించిన ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించబోమని స్పష్టం చేసింది.
ఈ దాడిలో మొత్తం 11 మంది నౌకా సిబ్బంది గాయపడినట్లు సంస్థ వెల్లడించింది. వీరిలో తొమ్మిది మంది చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా, మరో ఇద్దరు ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి ప్రజలు అధికారిక వర్గాలు వెల్లడించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ADNOC L&S సూచించింది. ధృవీకరించని వార్తలు, వదంతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. గల్లంతైన సిబ్బంది మృతి: ADNOC ప్రకటన
- ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న కువైట్.. నలుగురికి గాయాలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
- ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!
- దుబాయ్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ విస్తరణకు భారీ ముందడుగు..!!
- ఖతార్‌లో ఆన్లైన్ అపాయింట్మెంట్ సదుపాయం..!!
- కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు







