ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!

- November 27, 2026 , by Maagulf
ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!

మస్కట్: ఒమన్‌లోని నార్త్ అల్ బాతినా గవర్నరేట్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మయ్హా బని ఖయూమ్ ప్రాంతంలోని హైవేపై రెండు ట్రక్కులు, మరో వాహనం మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదం అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అగ్నిమాపక సిబ్బంది కూలింగ్ ప్రక్రియ చేపట్టారు. పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనలో ఓ వ్యక్తికి మధ్యస్థంగా గాయాలయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది అతడిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, వాహనాలకు జరిగిన నష్టం వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com