ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!

- November 28, 2026 , by Maagulf
ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!

మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAFO) అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్ చేపట్టింది. ధోఫర్ గవర్నరేట్‌లోని జబల్ సమ్హాన్ ప్రాంతం నుంచి అనారోగ్యానికి గురైన ఓ పౌరుడిని హెలికాప్టర్ ద్వారా సలాలాలోని సుల్తాన్ ఖాబూస్ ఆసుపత్రికి తరలించింది.

సదరు పౌరుడి ఆరోగ్య పరిస్థితి అత్యవసర వైమానిక తరలింపు అవసరమయ్యే స్థాయికి చేరడంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు బాధితుడిని సురక్షితంగా ఆసుపత్రికి చేర్చినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com