బిగ్ టికెట్ లక్కీ డ్రా.. నలుగురు భారతీయ ప్రవాసులకు తలా Dh25,000..!!

- November 29, 2026 , by Maagulf
బిగ్ టికెట్ లక్కీ డ్రా.. నలుగురు భారతీయ ప్రవాసులకు తలా Dh25,000..!!

అబుధాబి: యూఏఈలో నిర్వహిస్తున్న బిగ్ టికెట్ నవంబర్ నెల మూడో వారపు ఈ-డ్రా విజేతలను ప్రకటించింది. ఈ డ్రాలో నలుగురు భారతీయ ప్రవాసులు విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరికి Dh25,000 చొప్పున నగదు బహుమతి లభించింది. విజేతల్లో ఒకే టికెట్ కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులు కూడా ఉండటం విశేషం.

తమిళనాడుకు చెందిన అరవిందన్ కె. అబుధాబిలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సాధారణంగా స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు చేసే ఆయన ఈసారి తన సోదరుడితో కలిసి టికెట్ తీసుకున్నారు. దక్షిణ భారత జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకుని టికెట్ నంబర్ ఎంపిక చేసినట్లు 35 ఏళ్ల అరవిందన్ తెలిపారు. బహుమతిగా వచ్చిన మొత్తాన్ని తన సోదరుడితో పంచుకోనున్నట్లు చెప్పారు. తన తల్లి వైద్య ఖర్చులకు ఆర్థికంగా సహాయం చేయాలని ఎదురుచూస్తున్న సమయంలో ఈ బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉందని అరవిందన్ పేర్కొన్నారు. విజయం సాధించినట్లు ఫోన్ రావడంతో ఆశ్చర్యం, ఆనందం కలిగాయని, తమ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం సరైన సమయంలో అందిందని తెలిపారు.

షార్జాలో నివసిస్తున్న మరో భారతీయ ప్రవాసి మకరంద్ నివృత్తి పాటిల్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ ద్వారా Dh25,000 గెలుచుకున్నారు. గత మూడేళ్లుగా అప్పుడప్పుడు బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. యూఏఈలో నివసిస్తున్న షరాఫుద్దీన్ ఖాసిం కూడా ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేసి Dh25,000 నగదు బహుమతిని గెలుచుకున్నారు. 

అదే విధంగా అబుధాబిలో క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రీతి ఆంటో ఆంటోనీ ఆంథిక్కాట్ వక్కో మరో విజేతగా నిలిచారు. ఆమె స్టోర్‌లో కొనుగోలు చేసిన టికెట్‌కు బహుమతి రావడంతో ఆనందంలో మునిగిపోయారు. బిగ్ టికెట్ ప్రతినిధి బౌష్రా నుంచి విజయం సాధించినట్లు ఫోన్ అందుకున్న సమయంలో నవ్వులు, ఆశ్చర్యం, ఆనందభాష్పాలతో స్పందించారు. కొంతకాలంగా స్నేహితుల బృందంతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నానని, వచ్చిన బహుమతిని వారితో పంచుకుంటానని తెలిపారు.

డిసెంబర్ 3న గ్రాండ్ ప్రైజ్ డ్రా

బిగ్ టికెట్ తదుపరి లైవ్ డ్రాలో ఏకంగా Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ విజేతను ప్రకటించనున్నారు. డిసెంబర్ 3న జరిగే ఈ డ్రాలో మరో ఐదుగురికి ఒక్కొక్కరికి Dh100,000 చొప్పున కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నారు. ఇంకా ఒక వారపు ఈ-డ్రా మిగిలి ఉంది. ఇందులో నలుగురికి తలో Dh25,000 బహుమతి లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com