సౌదీలో ముగ్గురికి మరణశిక్ష...

- August 01, 2015 , by Maagulf
సౌదీలో ముగ్గురికి మరణశిక్ష...

సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ముగ్గురి తలలను తెగనరికారు. సౌదీ అరేబియాలో ఆ దేశానికి చెందిన అల్-దియాని, షిరో అల్-జినోబి, మన్సూర్ అల్ రోలీ అనే ముగ్గురి తలలను నరికి మరణిక్షను అమలుచేశారు. ఈ శిక్షను ముగ్గురికీ వేరు వేరు ప్రాంతాలలో అమలు చేశారు. వీరిలో దియాని, జినోబి‌లు హత్య కేసులో అరెస్టు చేయబడినవారు కాగా, మన్సూర్ మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేసినందుకు అరెస్టు అయ్యాడు. ముగ్గురితో కలిపి ఈ ఏడాది సౌదీలో మరణ శిక్షకు గురైన వారి సంఖ్య 107కు చేరింది. ఈ విధంగా తలలు తెగనరికి మరణశిక్షలను విధించడంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత మే నెలలో తలలు తెగనరికేందుకు పనివారు కావలెను అంటూ సౌదీ ప్రభుత్వం ప్రకటన చేయడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com