ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకు ఎదురుదెబ్బ
- August 31, 2016
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, సిరియా సంయుక్త బలగాల దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ అధికార ప్రతినిధి అబు అహమ్మద్ అల్ అద్నానీ అంతం అయ్యాడు.
సిరియాలోని అలెప్పో ప్రావిన్స్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద నాయకులను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు జరిపామని అమెరికా తెలిపింది. అద్నానీ మరణించాడని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దృవీకరించింది.
కాల్పులు పర్యవేక్షించడానికి వెళ్లిన అద్నానీని అమెరికా, సిరియా సంయుక్త బలగాలు చాకచక్యంగా అంతం చేశాయి.
ఐఎస్ఐఎస్ కి చెందిన కీలక సీనియర్ నేతలను లక్షంగా చేసుకుని దాడులు చేస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే అద్నానీ అంతం అయ్యాడు.
సిరియాలోని అల్ బాబ్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ నాయకులను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తున్నారు. అద్నానీని అంతం చేసి తాము విజయం సాధించామని అమెరికా, సిరియా తెలిపాయి.
అయితే అద్నానీ అంతం అయినంత మాత్రాన తమకు నష్టం లేదని, అద్నానీ లాంటి వారు పదుల సంఖ్యలో పోరాటం చేయ్యడానికి ముందుకు వస్తారని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తెలిపింది.
అలెప్పో మీద పట్టుకోసం అద్నానీ ఆధ్వర్యంలోనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కొంత కాలం నుంచి దాడులు చేస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన సంయుక్త బలగాలు అద్నానీని టార్గెట్ చేసుకుని అంతం చేశాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







