బ్రెడ్ కట్లెట్
- August 01, 2015
బ్రెడ్ కట్లెట్
కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ స్లైసెస్ - నాలుగు
బంగాళా దుంపలు - ఒకటి
పచ్చి బఠాణీలు - రెండు కప్పులు
క్యాబెజ్ తురుము - ఒక కప్పు
క్యారెట్ తురుము - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం తురుము - అరటీస్పూను
గరం మసాలా - ఒక టీ స్పూను
నిమ్మరసం - ఒక టీ స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత
బ్రెడ్ పొడి - ఐదు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్‌లో నూనె వేసి ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి మిగిలిన కూరగాయల ముక్కలు కూడా వేయించి, బఠానీలు, గరం మసాలా వేసి కొంచెం సేపు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. బంగాళా దుంపలను ఉడికించి, చెక్కు తీసి చిదిమేసి దానిలో ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపి పైన వేయించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమంలో కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేతిలో పెట్టుకుని టిక్కీల్లా చేసుకుని వాటిని బ్రెడ్ పొడిలో దొర్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసెల పాన్ మీద నూనె వేసుకొని వీటిని ఒక్కొక్కటి నూనె వేస్తూ రెండు వైపులా దోరగా వేయించాలి.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







