పాలకూరతో జ్ఞాపక శక్తి లభిస్తుంది.

- August 01, 2015 , by Maagulf
పాలకూరతో జ్ఞాపక శక్తి లభిస్తుంది.

ఆకుకూరల్లో పాలకూర రారాజులాంటిది అని చెప్పవచ్చు. ఈ పాలకూరలోని ఫోలిక్‌ యాసిడ్‌ పిల్లల్లో ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు పాలకూరపై తాజాగా చేసిన అధ్యయనాల ఫలితంగా కొన్ని విషయాలు ఋజువయ్యాయి. పాలకూరలోని ఫోలిక్‌ ఆమ్లం మెదడులోని కండరాలను ఉత్తేజపరుస్తూ జ్ఞాపకశక్తి మెండుగా పెరగడానికి దోహదపడ్తుంది. పాలకూరను ప్రతీరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్‌ ఆమ్లం శరీరానికి అంది వయసుతో పాటు వచ్చే మతిమరుపు దూరమవుతుంది. వయసు పెరిగే కొలదీ మన మెదడులోని హిప్పో క్యాంపస్‌ పనితీరు మొద్దుబారుతూ వస్తుంది. అలా జరక్కుండా ఉండడానికి శరీరానికి ఫోలిక్‌ ఆమ్లం ఎంతగానో దోహదపడ్తుంది. అందుకే ప్రతిరోజూ తాజా పాలకూర మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోజువారీ మన శరీరానికి అవసరమయ్యే ఫోలిక్‌ యాసిడ్‌లో 15 శాతం అదనంగా అందుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com