గౌతమ్ పుట్టిన రోజు వేడుకలు

- August 31, 2016 , by Maagulf
గౌతమ్ పుట్టిన రోజు వేడుకలు

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు నెంబర్ వన్ హీరో రేసు లో ఉన్నారు. ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో యావరేజ్ హీరో అనిపించుకున్న మహేష్ మురారి చిత్రం తర్వాత యాక్షన్ తరహా చిత్రం పోకిరి, అతడు,ఒక్కడు, దూకుడు లాంటి చిత్రాలతో ఒక్కసారే స్టార్ డమ్ సంపాదించారు. గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో కూడా మహేష్ చిత్రం చేరింది. మహేష్ బాబు తన సహనటి నమ్రతా శిరోడ్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరికి గౌతమ్ కృష్ణ , తార అనే పిల్లలు ఉన్నారు...షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు తన కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇస్తారు.

సంవత్సరంలో రెండు నెలలు విదేశీ టూర్లు వేస్తూ పిల్లతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఆగస్ట్ 31, 2006లో గౌతమ్ జన్మించిన సంగతి తెలిసిందే. గౌతమ్ కృష్ణ 1 నేనొక్కడినే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ త్వరలో అల్లూరి సీతారామరాజు బాల్యంకు సంబంధించి తెరకెక్కనున్న మూవీలో కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com