మూడు వరాలు

- August 01, 2015 , by Maagulf
మూడు వరాలు

ఒక ఊరిలో రామయ్య, దానయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య శ్రీమంతుడైనా మహా పిసినారి. దానయ్య కటిక పేదవాడు. అయినప్పటికీ తన పేరుకు తగ్గట్టుగా తనకున్నంతలో దానధర్మాలు చేస్తూ సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు దేవుడు వార్ద్దిరినీ పరీక్షించడానికి ఒక ముసలివాని వేషంలో ముందుగా రామయ్య ఇంటికి వచ్చి, చీకటి పడిపోయింది. బాబూ కొంచెం ఈ రాత్రికి పడుకోవడానికి నాకు నీ ఇంట్లో చోటియ్యవా? అని అడిగాడు. అందుకు రామయ్య చిరాకు పడి అక్కడి నుండి వెళ్లిపోమన్నాడు. ఆ ముసలివాడు తరువాత దానయ్య ఇంటి వైపు వెళ్లగా అతను గుమ్మంలోంచే అయ్యో పెద్దవారు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. మా ఇంట్లోకి రండి. అంటూ తీసుకెళ్లి ఆ పూట తను వండుకున్నది ముసలివానికి పెట్టి తను మంచినీళ్లు తాగి పడుకున్నాడు. అది చూసి దేవుడు ప్రత్యక్షమయ్యి, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు దానయ్య నాకేం వరం వద్దు స్వామీ! నేను ఉన్నంతలోనే నలుగురికీ సాయపడుతూ, నిరంతరం నిన్ను ధ్యానిస్తూ సంతోషంగా జీవించే అదృష్టాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. అందుకు దేవుడు తను ఉన్న పూరిపాకను పెద్ద భవంతిలా మార్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రామయ్య ఆ వృద్ధున్ని వెతుక్కుంటూ వెళ్లి తను చేసిన తప్పును క్షమించమని తనింటికి ఆతిధ్యానికి రమ్మని పిలిచాడు. అందుకు దేవుడు నాకు నీ ఆతిధ్యం అక్కరలేదు కానీ నీకు మూడు వరాలు ఇస్తాను తీస్కో. నీవు ఇంటికి వెళ్లే లోపల నువ్వనుకున్న మూడు మాటలు నెరవేరతాయి అన్నాడు. దాంతో సంతోషంగా బయలుదేరిన అతనికి దారిలో ఒక కుక్క ఎదురువచ్చింది. ఛీ! వెధవ కుక్క నీ చావడ అన్నాడు దాంతో ఆ కుక్క చచ్చిపోయింది. ఇంటికి చేరగానే గుమ్మంలో కాసేపు కూర్నోని ఉండగా భార్య ఇంట్లోకి రమ్మని పిలవగా..నేను చచ్చినా ఇక్కడి నుండి లేవలేనిప్పుడు అన్నాడు. అంతే అక్కడే అతుక్కుని ఉండిపోయాడు. అప్పుడు అతనికి జరిగింది అర్ధమయ్యి బుద్ధి తెచ్చుకుని సక్రమంగా జీవించసాగాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com