అమెరికా అధ్యక్షుడికి అరుదైన గౌరవం
- September 03, 2016
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల గుర్తించిన అరుదైన జాతికి చెందిన చేప పేరులో 'ఒబామా' చేర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే ఈ గౌరవం ఆయనకు ఊరికే దక్కింది కాదు. గతవారం హవాయ్ లోని ఓ మెరైన్ సాంక్షుయరీ విస్తీర్ణం పెంచుతూ ఒబామా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సాంక్షుయరీ విస్తీర్ణం గతంలో కంటే నాలుగింతలు పెరుగుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే పెద్ద మెరైన్ సాంక్షుయరీగా అది రికార్డులకెక్కింది. దీంతో జంతు శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇటీవల గుర్తించిన ఇంకా పేరుపెట్టని చేపకు ఒబామా పేరును చేర్చుతున్నట్లు వారు వెల్లడించారు.
హవాయ్ లోని పపహనౌముకాకియా మెరైన్ సాంక్షుయరీలోనే శాస్త్రవేత్తలు ఈ చేపను కనుగొన్నారు.
ఈ చేపకున్న మరో విశేషం ఏమిటంటే.. ఒబామా ప్రచార సింబల్ కు దగ్గరగా ఈ చేపపై కొన్ని గుర్తులున్నాయట. సముద్ర జీవులను రక్షించడానికి ఒబామా తీసుకున్న నిర్ణయానికి గుర్తుగా ఆయనకు ఈ గౌరవమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్నట్లు ఓ చేపకు ఒబామా పేరునుపెట్టడం ఇదే తొలిసారికాదు.
గతంలోనూ టెనెస్సీ నదిలో కనుగొన్న ఓ చేపకు ఇథియోస్టోమా ఒబామా అనే పేరుపెట్టారు.
తాజా వార్తలు
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్







